పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ ఫస్ట్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తూ పవర్ స్టార్ స్టామినా ఏంటనేది మరోసారి తెలియచేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. ఇప్పటికే విడులైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ‘వకీల్ సాబ్’ నుంచి ‘మగువా మగువా’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. సిద్ శ్రీరామ్ ఆలపించారు. ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కనవా’ అనే లిరిక్ ఆకట్టుకొంటోంది. ఈ రెండు లైన్లు వింటుంటే ఇది మహిళ గొప్పతనాన్ని చాటే పాట అని అర్థమవుతోంది. ఇలాంటి పాట పవన్ సినిమా అందులోనూ సిద్ శ్రీరామ్ స్వరం నుంచి జాలువారితే సెన్సేషన్ కాక ఇంకేమవుతుంది. మహిళల త్యాగం, గొప్పదనం తెలుపుతూ రూపొందించిన ఈ పాటను మహిళలందరికీ అంకితమిచ్చారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కంపోజిషన్లో లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడగా రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన పదాలు రాశారు. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ ఇండియా ట్రెండింగ్‌లో నెం.1 ప్లేస్‌లో కొనసాగుతోంది. ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని వేసవి కానుకగా మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
previous post
కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా… వర్మకు ప్రముఖ నిర్మాత కౌంటర్