ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఆయన చేతులెత్తేశారంటూ ట్వీట్ చేశారు.
‘రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించింది చాలక ఇంత హడావుడి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మద్యం, డబ్బు పంపిణీ లేక పోతే మేం పోటీ చేసేది లేదని ఇప్పటికే చేతులెత్తేశారు. దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ అని దుయ్యబట్టారు. నీవల్ల కాదు గానీ కుల మేధావి కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకో అని హితవు పలికారు.