telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

నటితో రుతురాజ్ గైక్వాడ్ డేటింగ్…?

ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ సీరియల్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు హల్‌‌చల్ చేస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసే ఈ ఇద్దరి రచ్చ చూస్తే వారి మధ్య ఉన్న లవ్ ఎఫైర్ అర్థమవుతుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా సయాలి సంజీవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలపై రుతురాజ్ గైక్వాడ్ కామెంట్ చేశాడు. వావ్.. లవ్లీ అంటూ కళ్లల్లో ప్రేమ నిండిన ఎమోజీలను పోస్ట్ చేశాడు. హీరోయిన్ కూడా లవ్ సింబల్స్‌తో సిగ్గుపడుతున్నట్లుగా ఉన్న ఏమోజీలతో రిప్లే ఇచ్చింది. దాంతో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సయాలి సంజీవ్ అందానికి రుతురాజ్ గైక్వాడ్ పడిపోయాడంటూ నెట్టింట మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ పుకార్లపై రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. బౌలర్లు మినహా మరేవరూ తనను క్లీన్ బౌల్డ్ చేయలేరని పరోక్షంగా మరాఠీలో కామెంట్ చేశాడు. ‘కేవలం బౌలర్లు మాత్రమే నా వికెట్ తీయగలరు. అది కూడా క్లీన్ బౌల్డ్ చేయలగలరు. మరెవరికీ ఇది సాధ్యం కాదు. అర్థం అయిన వారికి, అర్థం కావాల్సిన వారికే ఈ విషయం’అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. దాంతో ఈ లవ్ రూమర్స్‌కు బ్రేక్ పడినట్లు అయింది. అయితే గైక్వాడ్ మీదికి అలా చెబుతున్నా.. సయాలి ప్రేమలో మాత్రం మునిగితేలుతున్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సయాలి పాపులర్ మరాఠీ టీవి నటి. ఇప్పటికే ఆమె చాలా సీరియళ్లలో నటించింది.

Related posts