బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన పార్దీవదేహానికి బుధవారం బీహార్‌లోని సుపౌల్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సమయంలో అపశృతి చోటుచేసుకున్నది. గన్ సెల్యూట్ ఇవ్వడానికి సిద్దమైన సమయంలో పోలీసులు గాలిలోకి కాల్పులు చేపట్టారు.అయితే పోలీసుల తుపాకుల నుంచి బుల్లెట్లు ఫైర్ కాలేదు.
దీంతో అక్కడున్న వారు విస్తుపోయారు. బీహార్ రాజకీయాల్లో డాక్టర్ సాహేబ్‌గా పేరుగాంచిన జగన్నాథ్ మిశ్రా కాంగ్రెస్ పార్టీ తరుఫున మూడుసార్లు సీఎం పదవి చేపట్టారు. ఆ రాష్ట్రానికి చివరి కాంగ్రెస్ సీఎం కూడా ఆయనే. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, బీహార్ సీఎం నితీశ్‌తోపాటు పలువురు సంతాపం తెలిపారు. బీహార్ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది.