telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వెంకీకి వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్…

Venkatesh

టాలీవుడ్‌లో ఇప్పుడున్న సీనియర్ హీరోలలో వెంకటేశ్ దగ్గుబాటికి ప్రత్యేక స్థానం ఉంది. తన స్టార్ డమ్ ఇమేజ్ లను పక్కన పెట్టి మంచి కథాబలం ఉండే సినిమాలకు ప్రాధాన్యతనిస్తాడు. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు ఈ బాబు బంగారం. తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలకు బీజం వేసింది వెంకీనే. వెంకటేశ్ సినిమా అంటే కచ్చితంగా అది మినిమం గ్యారెంటీ సినిమా అనే చెప్పాలి. అందుకే ఆయనకు ‘విక్టరీ’ వెంకటేశ్ అనే పేరు. మూవీ మొఘల్ దివంగత రామానాయుడు కుమారుడిగా 1986లో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్, తన కెరియర్ లో ఇప్పటివరకు 73 సినిమాలు చేశాడు. 74 వ సినిమా నారప్ప షూటింగ్ జరుపుకుంటోంది.  పుట్టినరోజు సందర్భంగా నిన్నటి రోజున ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.  7 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్స్, 5 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు విక్టరీ వెంకటేష్. అయితే నేడు విక్టరీ వెంకటేస్ తన 60వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ తారలు వెంకీమామకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవీ నీతో ఉన్న ప్రతి క్షణం నాకు ఎంతో మదురంగా ఉంటుంది. నీ ప్రేమాప్యాతలను చూపడంలో, ఇతరులకు సహాయం చేయడంలో నీకు నీవే సాటి. వచ్చే ఏడాది కూడా నీకు శుభప్రథం కావాలి. నారప్ప చాలా ఇంటెన్సిటీగి ఉంది. దాంతో నీవు మరో విజయం సాధించాలని వెంకటేష్ శుభాకాంక్షలు తెలిపాడు. ఇక చిన్నోడు మహేష్ బాబు సూపర్ కూల్ వెంకీమామకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆనందం, ఆరోగ్యం ఎప్పుడూ నీచెంతే ఉండాలంటూ ట్వీట్ చేశాడు. వీరితో పాటుగా దర్శకుడు అనిల్ రావిపూడి కూడా విష్ చేశాడు. కొత్త సంవత్సరంలోకి వెల్లే ముందు కాస్ పాత ఆనందాన్ని చూద్దామంటూ ఎఫ్2 సినిమా క్లిప్స్‌ను తన ట్వీట్‌కు జత చేశాడు.

Related posts