telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు సాంకేతిక

చంద్రయాన్-2 ల్యాండింగ్ .. వీక్షణకు కేంద్రీయ విద్యార్థుల ఎంపిక..

kendriya vidyalaya students to isro on

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల నుండి చంద్రయాన్-2 ల్యాండింగ్ చూసేందుకు 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ ప్రయోగంపై అవగాహన పెంచేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ స్పేస్ క్విజ్ పోటీని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగుమోపే దృశ్యాన్ని ప్రధాని నరేంద్రమోదీతో కలిసి వీక్షించే అవకాశం కల్పించింది. మైగవ్.కామ్ సమన్వయంతో ఇస్రో ఆన్‌లైన్ క్విజ్‌ను నిర్వహించింది.

ఈ క్విజ్‌లో 1,50,279 మంది విద్యార్థులు పాల్గొనగా వీరిలో 16 మంది విజేతలుగా నిలిచారు. ఈ క్విజ్ పోటీలో 20 ప్రశ్నలకు 300 సెకన్లలో సమాధానం ఇవ్వాల్సి ఉంది. చంద్రయాన్-2లో మరో కీలక ఘట్టం మంగళవారం విజయవంతమైంది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్‌కు చెందిన తొలి కక్ష్యను ఇస్రో విజయవంతంగా తగ్గించింది. ఈ నెల 7వ తేదీన 1:50 నిమిషాల నుంచి 2:30 గంటల మధ్య చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-2 దిగనుంది.

Related posts