telugu navyamedia
Uncategorized

వేట కోసం వస్తున్న వారే ఎక్కువ…

వికారాబాద్ అడవుల్లోని దామగుండంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అలాగే ఆమె బంధువులకు ఫామ్ హౌజ్ లు ఉన్నాయని ఆ ఫామ్ హౌజ్ కు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. అయితే పూడూరు మండల పరిధిలోనే 400 వరకు ఫామ్ హౌజ్ లు ఉన్నాయి. అయితే వీక్ ఎండ్ లో ఆ ఫామ్ హౌజ్ లకు ఫుల్ డిమాండ్ వస్తుందని… అవి రాజకీయ, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలకు చెందిన ఫామ్ హౌజ్ లు అని స్థానికులు అంటున్నారు. కేవలం అసాంఘిక కార్యకలాపాల కోసం కొన్ని స్పెషల్ ఫామ్ హౌజ్ లు ఉన్నాయని. అందులోకి వేట కోసం వస్తున్న వారే ఎక్కువ అని అంటున్నారు. అప్పుడప్పుడు తుపాకి పేలిన శబ్దాలు వినపడతాయి అంటున్నారు స్థానికులు. ఆవు పై కాల్పులు జరిగి అది మృతి చెందింది కాబట్టే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డీప్ ఫారెస్ట్ ఉండటంతో.. వేటాడిన ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తున్న దుండగులు అంటున్నారు. ఫామ్ హౌజ్ దరిదాపుల్లోకి పశువులు తీసుకొని రావద్దు అంటూ నిర్వాహకులు తమను బెదిరిస్తున్నారు అని స్థానికులు ఫిర్యాదు చేసారు. దీంతో ఫామ్ హౌజ్ నిర్వాహకులు, సిబ్బందిని విచారించారు పోలీసులు. ఈ విచారణలో కల్పిలా ఘ్తన పై కీలక సమాచారం సేకరించారు. స్వాధీనం చేసుకున్న బుల్లెట్ ఏ రివాల్వర్ నుంచి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నారు.

Related posts