telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సచిన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చిరు

chiru

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరించిన దిగ్గజ ఆటగాడు క్రికెట్ దేవుడిగా కొలవబడుతున్న సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు నేడు (శుక్రవారం). ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సచిన్‌కు విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సచిన్‌కు ట్విటర్ ద్వారా విషెస్ తెలియజేశారు. `క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. భారతీయలకు నువ్వు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తావు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడ`ని చిరంజీవి ట్వీట్ చేశారు. కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చిరంజీవి, నాగార్జునతోపాటు సచిన్ కూడా సహ భాగస్వామి అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి లాక్‌డౌన్ కారణంగా పని లేకుండా పోయిన సినిమా వాళ్లకు సంబంధించి కరోనా క్రైసిస్ ఛారిటీ సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్నారు.

Related posts