ప్రస్తుతం రియల్ లైఫ్ లో హీరో అనిపించుకుంటున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. కరోనా సంక్షోభంలో సొంత ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకి అండగా నిలిచిన సోనూ సూద్‌కి జనాలు జేజేలు పలుకుతున్నారు. తాజాగా ఓ మహిళ తనకి పుట్టిన కొడుకుకి సోనూ సూద్ పేరు పెట్టి ఆయన రుణం తీర్చుకుంది. అనుపమ చోప్రాతో తాజాగా జరిగిన చాట్‌లో సోనూ సూద్ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఓ మహిళ తన కొడుకుకి సోనూసూద్ అని పేరు పెట్టిందని చెప్పాడు. ఇంటి పేరుని చివరికి చేర్చి సోనూ సూద్ శ్రీ వాస్తవ అని మహిళ పెట్టిందని చెప్పుకొచ్చాడు. ఇది నా మనస్సుకు హత్తుకుపోయిందని చెప్పుకొచ్చాడు సోనూ.
previous post
వకీల్ సాబ్ పై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు…