telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వాళ్ళ కోసం పవన్ ను కలుస్తానంటున్న బండ్ల గణేష్…!

bandlaganesh request on movie event

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బాగా సన్నిహితుడు, స్టార్ ప్రొడ్యూసర్ వీటన్నిటినీ మించి అతనికి బిగ్గెస్ట్ ఫ్యాన్ బండ్ల గణేష్. ఇక గతేడాది జరిగిన ఎలక్షన్స్ నుండి వీరిద్దరికి కొంచెం దూరం పెరిగింది అనే చెప్పాలి. అయితే తాజాగా బండ్ల గణేష్ ట్విట్టర్ లో నేను పవన్ కళ్యాణ్ ను కలుస్తాను అని చెప్పాడు. విషయమేమిటంటే… ఓ తల్లి ”పోలీస్ ఆఫీసర్ కావాలని కోరుకునే నా కొడుకు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. అతని అభిమాన నటుడు పవన్ కళ్యాణ్, అతను తనను కలవాలని ఆశిస్తున్నాడు. అతనికి అత్యవసర చికిత్స అవసరం. నేను కేవలం కార్మికురాలిని లక్షల డబ్బును ఎప్పుడూ చూడలేదు” అని కొడుకు ప్రాణాలను కాపాడాలని పవన్ కళ్యాణ్ ను విజ్ఞప్తి చేసింది. దానిని ఓ క్రౌడ్ ఫండింగ్ సంస్థ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ విషయం పై స్పందించిన బండ్ల గణేష్… నాకు వారి వివరాలు పంపించండి అని ఆ సంస్థను కోరుతూ నేను మీ కోసం పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు.

Related posts