telugu navyamedia
సినిమా వార్తలు

సినిమా రంగం శ్రేయస్కరం కాదని… అయినా… : రష్మిక మందన్న

Dear-COmrade

భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం “డియర్ కామ్రేడ్”. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌గా నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్ పొందిన ఈ చిత్రాన్ని జూలై 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు. ఇప్పటికే సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు. శుక్రవారం చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లో మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో సినిమాలోని పాట‌ల‌ను లైవ్‌గా పద‌ర్శించ‌డ‌మే కాకుండా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక స్టేజ్‌పై పాట‌ల‌కు డ్యాన్సులు చేసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించడం విశేషం. ఈ సంద‌ర్బంగా రష్మిక మందన్న మాట్లాడుతూ “నేను సినిమాల్లోకి రావాల‌నుకున్నాను. అయితే చాలా మంది వ‌ద్ద‌నే అన్నారు. సినిమా రంగం శ్రేయ‌స్క‌రం కాద‌ని కూడా చెప్పారు. అయితే నేను ప్రేమించిన దాని కోసం క‌ష్ట‌ప‌డ్డాను. అంద‌రినీ ఒప్పించాను. ప్ర‌తి అమ్మాయి చూడాల్సిన సినిమా `డియర్ కామ్రేడ్`. అంద‌రూ వారు ప్రేమించిన దాని కోసం పోరాటం చేయాలని చెప్పే చిత్రమిది” అని అన్నారు.

Related posts