“ఫిదా”, “ఐస్ క్రీం”, “మిఠాయి” వంటి చిత్రాల్లో నటించిన గాయత్రి గుప్తా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసి అప్పట్లో బాగా పాపులర్ అయింది. తాజాగా ఆడవాళ్ల వస్త్రధారణపై సంచలన కామెంట్స్ చేసింది ఈ బోల్డ్ బ్యూటీ. రేప్ లు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. సెక్సువల్ ఆకలిగా ఉన్నప్పుడు తిండి దొరకకపోతే మనిషి ఏం చేస్తాడో.. సెక్స్ కోరికలు కలిగినప్పుడు ఒత్తిడితో తప్పు అని తెలిసినా.. రేప్ చేస్తున్నారని.. అంతేతప్ప అమ్మాయి వేసుకున్న డ్రెస్ వలన కాదని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలోకి రావడానికి చాలా మంది భయపడుతున్నారనే కంటే.. భయపడే మనిషి ఏది చేయాలన్నా.. భయపడతాడని అంటోంది. ఇళ్లు దాటి బయటకి వచ్చావంటే ధైర్యం చేసినట్లేనని.. అది సినిమా ఇండస్ట్రీ అయినా.. సాఫ్ట్ వేర్ ఉద్యోగమైనా.. ఒకటే అని ఎక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉంటాయని చెప్పుకొచ్చింది గాయత్రి.
previous post
పవన్ కు వ్యతిరేకంగా మేము ప్లాన్ చేయలేదు… ట్రోల్ చేయకండి : రాజశేఖర్