telugu navyamedia
సినిమా వార్తలు

పుల్వామా ఎఫెక్ట్ : సల్మాన్ సినిమాలో పాక్ సింగర్ అవుట్

salman-khan-and-atif-aslam

పుల్వామాలో భారత సైనిక దళాలపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ దేశప్రజలు రకరకాలుగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ మాత్రం ఈ ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్ కు చెందిన నటీనటులను, సింగర్స్ ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. లేదంటే ఆయా నటీనటులపై కూడా నిషేధం తప్పదని హెచ్చరించింది. దీంతో మేకర్స్ ఒక్కొక్కరుగా తమతమ సినిమాల్లో పని చేస్తున్న పాక్ కళాకారులను తొలగించి వారి స్థానంలో కొత్త కళాకారులను తీసుకుంటున్నారు.

తాజాగా సల్మాన్ ఖాన్ నిర్మాణంలో రూపొందిస్తున్న “నోట్ బుక్” సినిమా నుంచి ప్రముఖ సింగర్ అతీఫ్ అస్లాంను తొలగించారని సమాచారం. అతీఫ్ పాకిస్తాన్ కు చెందిన సింగర్ కాబట్టి సినిమా నుంచి అతడిని తొలగించి, ఆ స్థానంలో అర్మాన్ మాలిక్ ను తీసుకున్నారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతున్న “నోట్ బుక్” సినిమాలో జహీరా ఇక్బాల్, ప్రనూతన్ భాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 29న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా తన రాబోయే చిత్రం “టోటల్ ధమాల్” చిత్రాన్ని పాకిస్తాన్ లో విడుదల చేయబోమని ప్రకటించారు. ఈ నిర్ణయంతో అజయ్ దేవగన్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

Related posts