telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఒంగోలు బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య పై చంద్రబాబు…

chandrababu

ఒంగోలులోని గొడుగుపాలెంకు చెందిన తేజశ్రీ అనే విద్యార్థిని క్విస్  ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత ఏడాది తేజశ్రీకి ఫీజురీయంబర్స్ మెంట్ వచ్చింది. అయితే ఈ ఏడాది ఫీజు రీయంబర్స్ మెంట్ రాలేదు. దీంతో కాలేజీ యాజమాన్యం ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తాళలేక తేజశ్రీ తల్లి విజయ కుమారి అప్పులు చేసి నిన్న ఫీజులో కొంత భాగం చెల్లించింది. ఇదే విషయం నిన్న రాత్రి ఇంట్లో చర్చకు వచ్చింది. ఒక వైపు ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యం ఒత్తిడి, మరో వైపు తల్లి ఆర్థిక ఇబ్బందులు చూసి తట్టుకో లేక తేజశ్రీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఈ అంశం మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. ఒంగోలులో బీటెక్ చదువుతున్న విద్యార్థిని తేజస్విని కళాశాల ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నదన్న వార్త మనసును కలచివేసిందని, అత్యంత దురదృష్టకరమైన విషయం ఇది. తల్లిదండ్రులకు చదివించే స్తొమత లేదన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది? ఫీజు రీఇంబర్స్ మెంటు ఏమైంది? అని ప్రశ్నించారు. నాడు నేడు అంటూ పనికిమాలిన కబుర్లు చెబుతూ విద్యావ్యవస్థను నాశనం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత నిరాశావాదంతో ప్రాణాలు తీసుకుంటోంది. వెంటనే విద్యార్థుల సమస్యలన్నిటినీ పరిష్కరించాలి. అలాగే తేజస్విని కుటుంబానికి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.  తేజశ్రీ ఆత్మహత్య కు పాల్పడటంతో కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఒంగోలు చర్చి సెంటర్ కి భారీగా చేరుకున్న విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

Related posts