telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పునర్నవి ఇవ్వబోయే వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇదే…!!

Punarnavi

బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం డిఫరెంట్ క్యాస్ట్యూమ్స్‌తో బిగ్ హౌస్‌లో జిగేల్ అన్పించింది. బిగ్ బాస్ తరువాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంది. తన ఇన్ స్టాగ్రామ్‌తో హాట్ హాట్ అందాలను బహిర్గత పరుస్తూ రోజుకో ఫొటోను షేర్ చేసి సెగలు పుట్టిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె షేర్ చేసిన హాట్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ‘ఉయ్యాల జంపాలా’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్టగోడ’, ‘ఎందుకో ఏమో’ తదితర చిత్రాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో తనలోని గ్లామర్ యాంగిల్‌కి పదునుపెట్టి ‘ఒక చిన్న విరామం’ అనే థ్రిల్లింగ్, యూత్ ఫుల్ లవ్ స్టోరీ సినిమా చేసింది పునర్నవి భూపాలం. పునర్నవి భూపాలం, గరిమ సింగ్, సంజయ్ వర్మ, నవీన్ నేని ప్రధాన తారగణంగా నటించిన ఈ మూవీ డిఫరెంట్ కథాంశంతో రోడ్ ప్రయాణంలో సాగే థ్రిల్లింగ్ కథతో రూపొందించారు. ఈ చిత్రానికి సందీప్ చేగురి దర్శకత్వం వహించి ఆయనే స్వయంగా నిర్మించారు. బిగ్ బాస్ సీజన్ 3 అప్పుడు హోస్ట్ నాగార్జున ఈ మూవీ టీజర్‌ను చూపించారు. కాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ప్రేమికులు దినోత్సవం కానుకగా పునర్నవి నటించిన ‘ఒక చిన్న విరామం’ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు.

Related posts