telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బిగ్ బాస్ 3 తెలుగు : .. ఫేక్ ఎలిమినేషన్ తో … నాగార్జున ట్విస్ట్ ..

ou students complaint on bigg boss 3 telugu

వారాంతంలో ఎవరు ఎలిమినేషన్ ఉంటుందో అని ప్రేక్షకులు ఎంతోగానో టెన్షన్ తో చూస్తుంటారు. కానీ శనివారం జరిగిన ఎపిసోడ్లో మాత్రం చివరికి నాగార్జున గారు ఇది ఫేక్ ఎలిమినేషన్‌ అని పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈ వారం నామినేషన్‌లో ఉన్న హిమజ, రాహుల్, మహేష్‌లలో రాహుల్ ఎలిమినేట్ అయినట్టుగా ఎపిసోడ్ చివరివరకూ చూపించి చివర్లో ఫేక్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. రాహుల్ తన ఫ్రెండ్ పునర్నవి కోసం త్యాగం చేసి నామినేషన్‌లో వెళ్లి బిగ్ బాస్ హౌస్ నుండి 9 వారం నామినేట్ అయినట్టు తెలిపారు. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తరువాత ఒక్క వారం తప్ప అన్ని వారాలు నామినేషన్‌లోకి వెళ్లి ఎలిమినేట్ కాకుండా సేవ్ అయిన రాహుల్ తొమ్మిదో వారం నామినేషన్ అయ్యారన్నారని, దానికి కారణం పునర్నవి అని తెగ నటించారు హోస్ట్ నాగార్జున. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేషన్ అయిన రాహుల్ ఏ మాత్రం ఫీల్ కాకుండా తన ఒరిజినల్ పెర్ఫార్మన్స్తో ఎప్పటిలాగే నవ్వుతూనే బిగ్ బాస్ హౌస్ స్టేజ్ మీదికి వచ్చాడు.

రాహుల్ నాగార్జున తో నేను పుటింది, పెరిగింది అంతా హోల్ సిటీ కావడం వల్ల అప్పుడప్పుడూ నా స్లాంగ్ అనుకోకుండా బయటకు వస్తుంది. బిగ్ బాస్ హౌస్‌కి రావడం వల్ల నేను ముఖ్యంగా ఎలా మాట్లాడలన్నది నేర్చుకున్నా.. ఓపికతో ఎలా ఉండాలో తెలుసుకున్నా అని చెప్పారు. రాహుల్ ఎలిమినేషన్‌తో షాక్‌లో ఉండి పోయింది పునర్నవి, ఏడుస్తూ అతను ఎలిమినేట్ అవుతాడని ఊహించలేదని అని నాగార్జునతో తెలిపింది. నేను ఎవర్ని తిట్టాలి సార్.. రాహుల్ లేకుండా హౌస్‌లో నేను ఎలా ఉండాలి.. నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ అని బాధ పడింది పునర్నవి. రాహుల్ ఎలిమినేషన్‌తో వరుణ్ కూడా చాలా బాధపడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివర్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున రాహుల్ నామినేషన్ అయినట్టు ప్రకటించి అందర్నీ ఏడిపించి బిగ్ బాస్ స్టేజ్ మీదికి తీసుకువచ్చి అంతా అయిన తరువాత ‘నువ్ నామినేట్ కాలేదని ఇది ఫేక్ ఎలిమినేషన్’ అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున.

Related posts