telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లోకేశ్ కు రాఖీ కట్టిన అఖిలప్రియ..స్వీట్ తినిపించి ఆశీర్వాదం!

Minister Lokesh comments YS Jagan

అన్నా చెల్లెళ్ళ అపురూప బంధాన్ని చాటే రక్షా బంధన దినోత్సవం వేడుకలు ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆనందోత్సాహలతో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ కు అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఈరోజు రాఖీ కట్టారు. అనంతరం లోకేశ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్న నారా లోకేశ్, “థాంక్యూ అఖిలప్రియా. నీలాంటి సోదరి ఉండటం నిజంగా నా అదృష్టమే. రాఖీ పండుగ శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అఖిలప్రియ తనకు రాఖీ కడుతున్న, స్వీట్ తినిపిస్తున్న ఫొటోలను లోకేశ్ పోస్ట్ చేశారు.

Related posts