ఏపీలో కరోనా మహమ్మారి సంక్రమణ నెమ్మదిగా విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకున్న ఏపీలో గత కొద్దికాలంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. అయితే 3-4 రోజుల్నించి మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నట్టు కన్పిస్తోంది. మొన్నటి వరకూ రోజుకు వేయికి దిగువకు చేరుకున్న కేసులు..ఇప్పుడు మళ్లీ 16 వందలు దాటుతున్నాయి.
రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 342 మందికి, చిత్తూరులో 276 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణైంది.
కొత్తగా 24 గంటల వ్యవధిలో 65,596 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,623 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2021325కి చేరింది. కొత్తగా 8 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13911 కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో1,340మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1992256కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15158 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 2,69,39,087 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా చిత్తూర్ జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చి మ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. కాగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదకరంగా 342 మందికి వైరస్ సోకింది. చిత్తూరు జిల్లాలో 276 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇసుక సమస్య: కన్నా