telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

టాంక్‌బండ్‌పై .. జీహెచ్‌ఎంసి అధికారుల.. బతుకమ్మ వేడుకలు..

bathukamma celebrations in tankbund

జీహెచ్‌ఎంసి అధికారులు సద్దుల బతుకమ్మ వేడుకల కోసం టాంక్‌బండ్‌పై భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. వేలాదిగా మహిళలు బతుకమ్మలతో తరలి వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేశారు. ఎల్బీ స్టేడియం నుంచి టాంక్‌బండ్‌ వరకు నిర్వహించే బతుకమ్మ శోభాయాత్ర జరిగే రహదారితోపాటు బతుకమ్మలను నిమజ్జనం చేసే బతుకమ్మ ఘాట్‌లోనూ ఏర్పాట్లుపూర్తయ్యాయి. బతుకమ్మలతో నిర్వహించే ర్యాలీ మార్గాల్లో రోడ్లమరమ్మతు పనులు, పరిసరాల పరిశుభ్రత పనులు జీహెచ్‌ఎంసి పూర్తిచేసింది. జీహెచ్‌ఎంసి పరిధిలోని ప్రతి జోన్‌ నుంచి వెయ్యి మంది స్వయం సహాయక బృందాల మహిళలు హాజరయ్యేందుకు 120 వాహనాలను జీహెచ్‌ఎంసి ఏర్పాటుచేసింది. ఆదివారం ఉదయం మహిళలు ఎల్బీస్టేడియానికి చేరుకుంటారు. ఇక్కడ రక రకాలపూలతో బతుకమ్మలు పేరుస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం 3గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి బతుకమ్మల ఊరేగింపు ప్రారంభమవుతుంది. మహిళలు తయారుచేసిన బతుకమ్మలతో టాంక్‌బండ్‌ వరకూ ఊరేగింపుగా చేరుకుంటారు. తర్వాత ఇక్కడ సాయంత్రం వరకూ బతుకమ్మ ఆడతారు.

ఈ కార్యక్రమ నిర్వహణకు పర్యాటక, సాంస్కృతిక శాఖలతోపాటు జీహెచ్‌ఎంసి ఏర్పాట్లు చేసింది. టాంక్‌బండ్‌ చుట్టూ రంగు రంగుల విద్యుత్‌ అలంకరణలుచేశారు. టాంక్‌బండ్‌ పై ప్రత్యేకంగా వేదికలు నిర్వహించారు. ఇక్కడి నుంచే ఆయా శాఖల అధికారులు వేడుకలను పర్యవేక్షిస్తారు. బతుకమ్మ ఘాట్‌ సిద్ధం బతుకమ్మ వేడుకల కోసం టాంక్‌బండ్‌ సమీపంలో బతుకమ్మ ఘాట్‌ను జీహెచ్‌ఎంసి అధికారులు సిద్ధం చేశారు. టాంక్‌బండ్‌ పరిసరాల్లో బతుకమ్మఆడే మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు బతుకమ్మ ఘాట్‌ను జీహెచ్‌ఎంసి ప్రత్యేకంగా నిర్మించింది. ఈఘాట్‌చుట్టూ ప్రత్యేకంగా మంచినీరు ఉండేలా నిర్మాణాన్ని చేపట్టారు. ఆదివారం జరిగే సద్దుల బతుకమ్మ పండగ నేపధ్యంలో ఘాట్‌ను పూర్తి స్థాయిలో శుభ్రం చేశారు. నీటిలోని వ్యర్ధాలను తొలగించారు.

Related posts