తెలంగాణలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తదితరులు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డికి కరోనా నిర్ధారణ అయింది.
మంత్రి భార్యకు సైతం కరోనా సోకడంతో వైద్యుల సలహా మేరకు వీరు ఐసొలేషన్ లో ఉన్నారు. మరోవైపు మల్లారెడ్డి కుటుంబసభ్యులకు, ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 77 వేలను దాటింది. 600కు పైగా మృతి చెందారు.