telugu navyamedia
సినిమా వార్తలు

“శ్యామ్ సింగ రాయ్” మూవీ ఎలా ఉందంటే?

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రా హుల్ సంకృత్యాన్ దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది.. పై 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో నాని.. వాసు, శ్యామ్‌ సింగరాయ్‌ అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు. ఇందులో సాయిపల్లివి , కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు.

Shyam-Singha-Roy

ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం.. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘శ్యామ్‌ సింగరాయ్‌’పై హైప్‌ క్రియేట్‌ అయింది. దాదాపు రెండేళ్ల తర్వాత థియేటర్స్‌లోకి వస్తున్న నాని సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెంచుకున్నారు.

Shyam Singha Roy Twitter Review: శ్యామ్ సింగరాయ్ ప్రజలను మెప్పించాడా ?.. ట్విట్టర్ రివ్యూ.. | Actor nani and sai pallavi movie shyam singha roy twitter review | TV9 Telugu

తాజాగా..“శ్యామ్‌ సింగ రాయ్‌” సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. ట్విట్టర్‌లో నాని “శ్యామ్ సింగ రాయ్” గురించి ఇప్పటికే   ప్రిమియర్స్ షో చూసిన చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా  తెలియజేస్తున్నారు. 

ట్విటర్ లో టాక్ ..

శ్యామ్ సింగరాయ్ కథ విషయానికి వస్తే..

వాసు(నాని) ఓచిన్న సినిమా డైరెక్టర్. అతను కీర్తి (క్రితి శెట్టి)ని ప్రేమిస్తుంటాడు. వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తున్న టైమ్ లో వాసుపై రౌడీల అటాక్ జరుగుతుంది. ఈ క్రమంలో వాసు తలకి బలమైన గాయం తగులుతుంది.. వాసుకి అప్పుడు గత జన్మ గుర్తుకు వస్తుంది. వెళ్తాడు.. అతను శ్యామ్ సింగరాయ్ అని వాసు తెలుసుకుంటాడు. శ్యామ్ సింగరాయ్ గురించి రిసర్చ్ చేస్తాడు. గతంలో కూడా శ్యామ్ సింగరాయ్ లవ్ స్టోరీ, ఆయన చేసిన ఉద్యమం….. గురించి తెలుస్తుంది. అందులో మైత్రేయి( సాయిపల్లవి) తో ప్రేమలో ఉంటాడు. మరి నెక్ట్స్ ఏం జరిగింది. క్లైమాక్స్ ఏంటీ అనేది అసలు ట్విస్ట్.

ముఖ్యంగా రాహుల్ డైరెక్షన్, నానీ రెండు విభిన్న పాత్రలో నాని ఒదిగిపోయాడని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. నాని, సాయి పల్లవి జోడీ మరోసారి అదరగొట్టిందని హర్షం వ్యక్తంచేశారు అభిమానులు..

అలాగే నాని క్రితి శెట్టితో బోల్డ్ సీన్స్ తో అదరగొటింది. ఇక శ్యామ్ సింగరాయ్ గా నానీ మరోసారి తన నటను ప్రూవ్ చేసుకున్నాడు. ఈమధ్య వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్న యంగ్ హీరో ఈసారి ఎలాగైనా సినిమా హిట్ కొట్టాలి అని పట్టుదలతో శ్యామ్ సింగరాయ్ కోసం బాగా కష్టపడ్డాడు.

ఇప్పటి వరకూ ఎప్పుడు లేని విధంగా కొత్త అవతారంలో కనిపించాడు నానీ. డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో. అనుకున్నట్టుగానే ఆడియన్స్ నుంచి మంచి మార్కులు సాధించాడు. నాని నటనకు డైలాగ్ డెలివరీకి చాలా మంది ఫిదా అయిపోయారు. ముఖ్యంగా నీ పేరు ఏంటీ అంటే శ్యామ్ సింగరాయ్ అంటూ వచ్చే సన్నీవేశం. ఇలాంటి కొన్ని సీన్స్ నానిని స్క్రీన్ పై కొత్తగా చూపించాయి.

Image

ఇక ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ సాయి పల్లవి. శ్యామ్ సింగరాయ్ సినిమా చూసి ప్రతీ  ప్రేక్షకుడు సాయి పల్లవిని, ఆమె నటనను పొగడ కుండా ఉండలేకపోతున్నారు. ఆమె నటన, డాన్స్, స్క్రీన్ ప్రజన్స్..ఇలా ప్రతీ ఎలిమెంట్ సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి. ఈ సినిమాలో ముగ్గరు హీరోయిన్లు ఉన్నా.. ఆడియన్స్ ను  మాత్రం  బాగా ఆకట్టుకుంది  సాయి పల్లవి నటనే. ఇక ఆమె డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. మరీ ముఖ్యంగా నెలరాజుని పాట ప్రేక్షకుల మనసుని తాకింది. ఈ పాటలో సాయి పల్లవి స్క్రీన్ ప్రజన్స్ ను చూసి..తెగ ముచ్చట పడిపోయారు ఆడియన్స్.

ఇక సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​తో సినిమాకు ప్రాణం పోశారని కొనియాడారు.ఇక శ్యామ్ సింగరాయ్ స్టోరీకి తగ్గట్టు.. ప్రతీ సీన్ కు అద్భుతమైన బ్యాక్ గ్రౌడ్ స్కోర్ అందించాడు మిక్కి. మ్యూజిక్ గురించి చాలా మంది ఒక్క పదంలో జస్ట్ అమేజింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. 

Shyam Singha Roy Movie Review Here What Twitter People Opinion

కాగా.. రెండేళ్ల తర్వాత థియేటర్‌లోకి వచ్చిన నాని.. . హిట్‌ కొట్టాడని ఎక్కువ మంది కామెంట్‌ చేశారు. మొత్తానికి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటం వల్ల థియేటర్లలో హౌజ్​ఫుల్ కలెక్షన్లు కనిపిస్తున్నాయి.

Related posts