కొన్ని షరతులు వర్తిస్తాయంటూ .. పెళ్లి కుమారుడు కావాలని కథానాయిక అదా శర్మ ప్రకటించారు. ఈ విషయాన్ని అదా ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. పెళ్లి కుమార్తె గెటప్‌లో తయారైన ఫొటోను షేర్ చేస్తూ.. ‘పెళ్లి కుమారుడు కావలెను. అతడు ఉల్లిపాయలు తినకూడదు. రంగు, కులం, ఫాలోవర్స్, రాశి.. తదితర విషయాలతో నాకు పనిలేదు. అతడు ఖచ్చితంగా మూడు పూటలు నవ్వుతూ వంట వండాలి. క్రమం తప్పకుండా షేవ్ చేసుకోవాలి. కేవలం సంప్రదాయ దుస్తులు ధరించాలి. రోజుకు 5 లీటర్ల మంచి నీరు తాగడానికి అందిస్తా.. కానీ మద్యం, మాంసాహారం ఇంట్లో, బయట నిషేధం. అతడికి భారత్‌లోని అన్ని భాషా చిత్రాలపై గౌరవం ఉండాలి, వాటిని చూసి ఎంజాయ్ చేసేవాడై ఉండాలి’ అని ఆమె వరుస ట్వీట్లు చేశారు.
అదా పోస్ట్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఉన్నట్లుండి ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని, సరదాగా మాట్లాడారా? అనే తికమకలో ఉన్నారు. అదా ఇటీవల ‘కల్కి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సీనియర్ నటుడు రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ప్రశాంత్ వర్మ దర్శకుడు. మరోపక్క అదా హిందీలో ‘కమాండో 3’, ‘బైపాస్ రోడ్’ సినిమాల్లో నటిస్తున్నారు.
అక్రమాస్తుల కేసులో తమరు ఏ2నే కదా.. విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు