telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘వకీల్ సాబ్’కి హీరోయిన్ గా ఇలియానా…?

vakeelsaab

పవన్ కళ్యాణ్‌ రీ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ చిత్రం ‘పింక్’ను తెలుగులో ‘వకీల్ సాబ్‌’గా రీమేక్ చేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మిస్తుండగా.. బోనీ కపూర్ సమర్పిస్తున్నారు. ఒరిజినల్ కథ ప్రకారం ఇందులో హీరోయిన్ పాత్ర చాలా తక్కువ ఉంటుంది. అయితే తెలుగులో ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ విడుదలైన తరువాత ఒరిజినల్ కథను మార్పులు చేర్పులు చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. ఇంతకీ పవన్ కళ్యాణ్‌తో నటించే ఆ బ్యూటీ ఎవరన్నదానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుండగా.. నిన్నటి వరకూ శృతి హాసన్ పేరు ప్రముఖంగా వినిపించింది.అయితే తాజాగా శృతి హాసన్ ప్లేస్‌ను గోవా బ్యూటీ ఇలియానా రీ ప్లేస్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలియానా గతంలో ‘జల్సా’ చిత్రంలో పవన్‌తో జోడీ కట్టగా.. శృతి హాసన్ ‘కాటమరాయుడు’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాల్లో నటించింది. ఈ ఇద్దరూ పవన్ కళ్యాణ్‌తో ఆడిపాడి ఉండటంతో వీరిలో ఎవర్ని ఫైనల్ చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది.

Related posts