ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు కాలి చిటికెన వేలుకు ఆపరేషన్ చేసిన మరుసటి రోజే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీనితో ఆసుపత్రి వర్గాలు మృతదేహాన్ని గుట్టుగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ లో ఉన్న విరించి ఆసుపత్రిలో సింగరేణి ఉద్యోగి సంగీత్ రావు చేరారు. ఆయన కాలికి వైద్యులు ఆరేషన్ చేశారు. అయితే నిన్న ఆరోగ్యం విషమించడంతో సంగీత్ రావు ప్రాణాలు కోల్పోయారు. దీంతో విరించి ఆసుపత్రి డాక్టర్లు మృతదేహాన్నిగుట్టుగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఈరోజు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. దీనితో ఈ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.