telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లాక్ డౌన్ వేళ టాలెంట్ ను బయటకు తీసిన బ్రహ్మానందం

brahmanandam with brahmmi is back movie

లాక్ డౌన్‌తో ఇంటికే పరిమితమైన ప్రముఖ తారలంతా తమలో ఉన్న కళా నైపుణ్యాల్ని ప్రదర్శిస్తు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. కొందరు వంట చేస్తుంటే మరికొందరు ఇంటి పనులు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఓ బొమ్మ గీశారు. అయితే ఆయన గీసిన చిత్రం మామూలు వ్యక్తిది కాదు. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన బ్రహ్మానందం తనలోని చిత్రకారుడిని నిద్రలేపూతూ ప్రముఖ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) చిత్రాన్ని ఆయన పెన్సిల్ తో గీశారు. ఆ చిత్రాన్ని బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్, తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం బ్రహ్మానందం కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘రంగ‌మార్తాండ‌’లో కీల‌క పాత్ర‌ పోషిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది.

Related posts