telugu navyamedia
సినిమా వార్తలు

ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌కు బండ్ల బిగ్ గిప్ట్‌..!

పవర్ స్టార్ అభిమానులకు త్వరలోనే పండగ చేసుకోబుతున్నారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో వందకు పైగా థియేటర్లలో మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమా విడుదల చేయనున్నారట. ఇప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు జన్మదిన వేడుకలకు ప్రిపరేషన్స్ మొదలు పెట్టేస్తున్నారు.

10tvnews

పవన్ కళ్యాణ్ ని దైవంలా ఆరాధించే గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా పవన్ ఫ్యాన్స్ తో పాటు సెలెబ్రేషన్స్ లో పాలుపంచుకుంటున్నాడు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేశారు. ఆ రోజున తెలుగు రాష్ట్రాల్లో గబ్బర్ సింగ్ చిత్రాన్ని 100 షోలు ప్రదర్శించబోతున్నట్లు తెలిపారు. మనం మన బాస్ పుట్టినరోజు థియేటర్లో జరుపుకుందాం, జై పవర్ స్టార్, జై దేవర ’అని బండ్ల‌ గణేష్ చెప్పుకొచ్చారు. కాగా..అభిమానులంతా తమకు దగ్గర్లో ఉండే థియేటర్స్ లో టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో కోరాడు.

Bandla Ganesh Another Cunning Act on Pawan

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్‌ సింగ్‌’చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2011 మే 11న విడుదలైన ఈ చిత్రం.. టాలీవుడ్‌ రికార్డులను తిరగరాసింది. దబాంగ్ సినిమాకు రిమేక్ అయినా.. కానీ పవన్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేశ్‏కు కూడా గుర్తింపు అందుకున్నాడు.

As it happened: Music launch of 'Gabbar Singh'

కాగా..వెంకన్నకు అన్నమయ్య, శివుడికి భక్త కన్నప్ప, రాముడికి హనుమంతుడిలా నేను పవన్ కళ్యాణ్‌కి భక్తుడినని సగర్వంగా చెప్పుకుంటున్నాను’’ అని చాలా సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. పవన్‌ కళ్యాణ్ ఒక వ్యసనం. ఒకసారి అలవాటు చేసుకుంటే.. చనిపోయి బూడిద అయ్యే వరకూ మనం వదల్లేం అంటుంటారు. పవన్‌కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకోబుతున్నారు బండ్ల గణేష్.

 

Related posts