telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“లాయర్ సాబ్” టైటిల్ గురించి స్పందించిన దిల్ రాజు

Pawan-Kalyan

కొన్ని రోజుల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నాడు. తన 26వ సినిమాగా ‘పింక్’ రీమేక్‌ని ఎంచుకున్నాడు. హిందీ, తమిళ్ భాషల్లో ‘పింక్’ చిత్రాన్ని నిర్మించిన బోని కపూర్, దిల్ రాజుతో కలిసి నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నిజంగా ‘పింక్’ రీమేక్ చిత్రానికి అదే టైటిల్ పెడుతున్నారా అని నిర్మాత దిల్‌ రాజు‌ను అడిగితే.. ఇంకా అసలు ఈ చిత్రానికి టైటిల్ ఏదీ అనుకోలేదని తెలిపారు. “ప‌వ‌న్‌ కళ్యాణ్ గారితో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటే ఇప్ప‌టికి కుదిరింది. పింక్ సినిమాను రీమేక్ చేస్తున్నాం. ఈ సినిమా టైటిల్‌పై ప‌లు వార్త‌లు వ‌స్తున్నాయి. టైటిల్ విష‌యంలో అధికారికంగా ఏమీ అనుకోలేదు. ఉగాదికి టైటిల్‌ను అనౌన్స్ చేస్తాం. సినిమాను మే 15న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. మే 11న గ‌బ్బ‌ర్ సింగ్ విడుద‌లైంది. కాబ‌ట్టి స‌మ్మ‌ర్‌లోనే రావాల‌ని అనుకుంటున్నాం. ‘వి’ సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత ప‌వ‌న్ సినిమా ప్ర‌మోష‌న్స్ గురించి ఆలోచిస్తాం. హిందీ, త‌మిళంలో చూసిన‌ట్టు కాకుండా సినిమాను మ‌రో కోణంలో చూపించబోతున్నాం” అని దిల్ రాజు తెలిపారు.

Related posts