telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బెడ్లు లేవని కరోనా బాధితుల ఆవేదన: లోకేశ్

Nara Lokesh

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో సరిపడా బెడ్లు లేక కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్  చికిత్స కు  ఆసుపత్రిలో బెడ్లు కూడా లేవంటూ  బాధితుడు ఒకరు కన్నీరు పెట్టుకున్నాడు. తన తల్లితో పాటు తాను కరోనా బారిన పడితే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.

అవసరానికి మించి బెడ్లు ఏర్పాటు చేశామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గారు అంటున్నారు. మరోవైపు, బెడ్లు లేవని మమ్మల్ని రోడ్ల మీదే వదిలేస్తున్నారంటూ కోవిడ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

అనంతపురం జిల్లా మడుగుపల్లి గ్రామానికి చెందిన మన్మథ రెడ్డి తండ్రి కరోనాతో మరణించారు. కుటుంబ సభ్యులకు వైద్యం అందని పరిస్థితి. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇప్పటికైనా జగన్ రెడ్డి కళ్లు తెరవాలని కోరుకుంటున్నాను’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

Related posts