telugu navyamedia
సినిమా వార్తలు

“జెర్సీ” మొదటిరోజు కలెక్షన్స్

Jersey

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం “జెర్సీ” క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన‌ ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. తొలి షో నుంచే “జెర్సీ” చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా ప్రముఖులు అల్లు అర్జున్, ఎన్టీఆర్ మంచు విష్ణు, అల్లరి నరేష్ తదితరులు కూడా ట్విట్టర్ వేదికగా నానితో పాటు “జెర్సీ” టీంపై ప్రశంసలు కురిపించారు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 4.6 కోట్ల షేర్స్ అందుకున్న జెర్సీ ఓవర్సీస్ లో 1.70కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక లో కోటికి పైగా కలెక్షన్స్ రాగా వరల్డ్ వైడ్ గా 7.12కోట్ల షేర్స్ ను జెర్సీ అందుకుంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన “జెర్సీ” సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇక ఈ సినిమాకు పోటీగా రాఘవ లారెన్స్ “కాంచన-3” వచ్చినప్పటికీ ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.

Related posts