అగ్ని ప్రమాదాలు ఈ మధ్య కాలంలో విపరీతంగా చోటు చేసుకుంటున‌్నాయి. తాజాగా.. రష్యా దేశంలోని ఓ వృద్ధాశ్రమం లో జరిగిని అగ్ని ప్రమాదంలో ఏకంగా 11 మంది మృతి చెందారు. బాష్ కోర్టొస్టాన్ ప్రాంతంలోని ఉరల్ పర్వత శ్రేణుల్లో ఉన్న ఓ వృద్ధాశ్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. తెల్లవారు జామున 3 గంటలకు ఆ ఆశ్రమంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు సుమారు మూడు నుంచి నాలుగు గంటల పాటు చెలరేగాయి. అయితే.. ఆ హౌమ్‌లో ఉన్న వారంతా వృద్ధులు కావడంతో అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. దీంతో ఆ వృద్ధులు మంటల్లో బలయ్యారు. ఆ వృద్ధాశ్రమంలో కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు రష్యా ఏజెన్సీ ప్రకటించింది. ఈ ఘటన పట్ల విచారణ మొదలు పెట్టినట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు. కాగా.. పురాతన భవనాలు, భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడంతో రష్యాలో తరచూ నివాస సముదాయాల్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి.
previous post
next post
అన్ని ప్రాంతాలకు పులివెందుల గ్యాంగులు: బుచ్చయ్య చౌదరి