కొత్త వాహన చట్టంతో వాహనదారులకు భారీగా చలానాలు పడుతుండటంతో కళ్ళు తేలేస్తున్నారు. విమర్శలు తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ చట్టంతో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారని ఆశిస్తున్నారు. ట్రాఫిక్ తనిఖీల్లో భాగంగా ఓ క్యాబ్ డ్రైవర్ నుంచి స్థానిక పోలీసులు 119 పెండింగ్ ట్రాఫిక్ చలానాలను వసూలు చేశారు. నార్సింగి ప్రాంతానికి చెందిన రమేశ్ క్యాబ్( TS07UA9202) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
కొంత కాలంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి నందుకు అతనికి 119 ట్రాఫిక్ చలాన్లు విధించారు. అయినప్పటికీ అతను కట్టలేదు. ఈ క్రమంలో ట్రాఫిక్ తనిఖీల్లో అతను దొరికిపోయాడు. దీంతో ఆ చలాన్లకు గాను మొత్తం రూ.27,165ను అతని నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్‌ఐ మక్బుల్ పాషా వసూలు చేశాడు.