telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

శ్రీలంక : … అజంత మెండిస్ … అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు..

srilanka cricketer ajantha mendis retire from

శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంత మెండిస్(34) దేశవాళీ క్రికెట్ ఆడుతున్నా, అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం రావడం లేదన్న నిరాశతో ఆ ఫార్మాట్ నుంచి తప్పకున్నాడు. 2015లో చివరిసారి జాతీయ జట్టుకు ఆడిన మెండిస్ అప్పటి నుంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. అయినప్పటికీ నిరాశే ఎదురవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఏడేళ్ల క్రికెట్ కెరియర్‌లో మెండిస్ 19 టెస్టులు, 87 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 70, వన్డే, టీ20ల్లో 218 వికెట్లు పడగొట్టాడు. అరంగేట్రంలోనే 8 వికెట్లు తీసి సంచలనం సృష్టించిన మెండిస్.. టీ20 క్రికెట్‌లో రెండుసార్లు ఆరు వికెట్లు పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత వికెట్ల వేటలో వెనకబడడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆడుతూ నాలుగేళ్లు ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో నిరాశతో అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

Related posts