telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ప్రభుత్వం సహకరించాలి.. విజయ్ మాల్యా విన్నపం!

Vijay malya

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా ట్విట్టర్ ద్వారా ఓ విన్నపం చేశారు. ‘కరోనా నేపథ్యంలో ఊహించని విధంగా యావత్ దేశాన్ని భారత ప్రభుత్వం లాక్ డౌన్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. లాక్ డౌన్ కారణంగా నా కంపెనీల కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. మా సంస్థల్లో పని చేస్తున్నవారిని ఇంటికి పంపలేకపోతున్నాం. వారికి తగిన వేతనాలు కూడా చెల్లించలేకపోతున్నాం. ప్రభుత్వం సహకరించాలి’ అని ట్వీట్ చేశారు.

తమ ఉద్యోగులను ఇంటికి పంపించడానికి సహకరించాలని చెప్పారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లిస్తానంటూ ఇప్పటికే పలుమార్లు ఆఫర్ చేశానని… నా నుంచి డబ్బు తీసుకోవడానికి బ్యాంకులు ముందుకు రాలేదని పేర్కొన్నారు. ఇదే సమయంలో అటాచ్ చేసిన తన ఆస్తులను రిలీజ్ చేయడానికి ఈడీ కూడా ముందుకు రాలేదని విజయ్ మాల్యా అసహనం వ్యక్తం చేశారు.

Related posts