telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీఎస్టీపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

KCR cm telangana

జీఎస్టీ ప్రతిపాదనలపై అభ్యంతరాలు తెలుపుతూ ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. కొత్త జీఎస్టీ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. కేంద్రం ప్రతిపాదనలు సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని విమర్శించారు. జీఎస్టీ నిర్ణయాలు అన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవేనని దుయ్యబట్టారు.

కరోనా ప్రభావంతో ఆదాయం ఘోరంగా పడిపోయిందని అన్నారు. రుణాలపై ఆంక్షలు సహేతుకం కావని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టేనని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన దేశం అవుతుందని వ్యాఖ్యానించారు.

Related posts