telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాలుష్యంపై నివేదిక.. రెడ్ జోన్ లో రాజధాని సహా పలు ప్రాంతాలు..

danger bells in pollution in India

రాజధాని లో కాలుష్య సమస్యతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. దీనితో ఇతర ప్రధాన నగరాలలో పరిస్థితులు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు ఆక్సిజన్‌ కొనుక్కోని ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా.. వాయు కాలుష్యంపై ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో నమ్మలేని నిజాలను పేర్కొంది. ఎయిర్‌ పొల్యూషన్‌లో ఢిల్లీ తర్వాత స్థానంలో.. కోలకతా రెండో స్థానంలో ఉండగా.. ఉత్తరాది రాష్ట్రాలన్నీ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు పేర్కొంది. కాగా.. దక్షిణాది రాష్ట్రాలు సేవ్‌ జోన్‌లో ఉన్నట్లు తెలిపింది. వాయు కాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది అకాల మరణం చెందుతున్నారని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా శ్వాసకోస బాధలతో బాధపడుతున్నట్లు నివేదికలో తెలిపారు. ఈ వాయు కాలుష్యం వల్ల గుండెపోటు, డయాబెటీస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.

రెడ్‌జోన్‌లో ఉన్న ప్రాంతాలు: ఢిల్లీ, లక్నో, బహదుర్‌ఘర్, భటిండా, భీవాండి, హాపూర్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, భివాని, హిసార్, ఫతేహబాద్, గురుగ్రామ్, బులంద్‌షహర్, అంబాలా, అమృత్‌ సర్, రోహతక్, పటౌడి, కాన్పూర్‌.

గ్రీన్‌జోన్‌లో ఉన్న ప్రాంతాలు: హైదరాబాద్, నెల్లూరు, వైజాగ్, కాకినాడ, విజయవాడ, చెన్నై, బెంగుళూరు, మైసూర్‌, కొచ్చి నగరాలు.

Related posts