అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడ మృతుల సంఖ్య మూడు వేలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. మరో లక్షా 60 వేల మందికి వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో ట్రంప్ వైట్‌హౌజ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టుపై ట్రంప్ మండిపడ్డారు. అనవసర ప్రశ్నలు అడగవద్దు అంటూ ఆవేశానికి లోనయ్యారు. అమెరికాలో పది లక్షల మందికి కరోనా పరీక్షలు చేపట్టినట్లు ట్రంప్ తెలిపారు. ఇదో మైలురాయి అని అన్నారు. ఆ సమయంలో ఓ రిపోర్టర్ ఓ ప్రశ్న వేశారు.
దక్షిణ కొరియా తరహాలో ఎందుకు పరీక్షలు చేపట్టడంలేదని ఆ జర్నలిస్టు అడిగారు. దక్షిణ కొరియా గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు అని ట్రంప్ అన్నారు. అప్పుడు ఆ రిపోర్టర్.. దక్షిణ కొరియా రాజధాని సియోల్ ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా అని ప్రశ్నించారు. దానికి వెంటనే ట్రంప్ .. ఆ నగరంలో 38 మిలియన్ల జనాభా ఉందన్నారు. కానీ సియోల్‌లో కేవలం 10 మిలియన్ల జనాభా మాత్రమే ఉన్నది. ఆవేశంతో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయవద్దూ అంటూ ఆ జర్నలిస్టు పై ట్రంప్ మండిపడ్డారు.
మోదీ భారతమాతకే అబద్ధాలు చెబుతున్నారు: రాహుల్