టీఆర్‌ఎస్ పార్టీపై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు విజయశాంతి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు రామమందిరం విరాళాలపై చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. “దేవుళ్ళకు కూడా ప్రాంతీయవాదం అంటగట్టే వైపరీత్య మనస్తత్వం టీఆరెస్ నేతలకే చెల్లు. దేశంలో మనది ఏ రాష్ట్రమైనా ముందుగా భారతీయులమనే విజ్ఞత మరచి అయోధ్య రాముడు… తెలంగాణ రాముడంటూ భేదభావాన్ని సృష్టిస్తున్నారు. అది చాలక అయోధ్య రామాలయానికి విరాళాలివ్వద్దని తమ ద్వేష మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. పైగా విరాళాన్ని భిక్షం అంటూ ఆరాధ్య భావంతో చేసే సమర్పణకు, అడుక్కోవడానికి తేడా తెలియని తమ అజ్ఞానాన్ని ప్రజలకు తెలియజేశారు. మన దగ్గర రాముడి ఆలయాలు లేవా… అంటున్న ఆ టీఆరెస్ నేత…. ఇళ్ళలోనే పూజామందిరాలు ఉన్నప్పుడు గుళ్ళకు… పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం దేనికో…. చెప్పాలి. ఇలా తలతిక్కగా మాట్లాడి అహంకారాన్ని ప్రదర్శించే టీఆరెస్ నేతలను ప్రజలు తప్పక ఇళ్ళకే పరిమితం చేస్తారనే సంగతి గుర్తుంచుకోవాలి.” అంటూ విజయశాంతి టీఆర్‌ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
previous post
next post