telugu navyamedia
రాజకీయ వార్తలు

ఈ ప్రత్యేక క్షణాలు చరిత్రలో లిఖించబడుతాయి: మోదీ

pm modi fire pulvama terror attacks

చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు దేశ వ్యాప్తంగా అభినందనలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఆయా రాష్ర్టాల సీఎంలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ ప్రత్యేక క్షణాలు చరిత్రలో లిఖించబడుతాయి. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు ఈ రోజు అని మోదీ పేర్కొన్నారు. చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతం మన శాస్త్రవేత్తల యొక్క శక్తిని తెలియజేస్తుందని మోదీ పేర్కొన్నారు.

శ్రీహరికోట నుంచి చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశం గర్వించదగ్గ చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్షంలో భారతీయను మరింత ముందుకు తీసుకువెళ్లిన శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు ఇతర సిబ్బందికి అభినందనలు. అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్వీట్ చేశారు.

Related posts