telugu navyamedia
రాజకీయ వార్తలు

కొడాలి నాని వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్

BJP Bandi sanjay

అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ఘటనపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని లేపాయి. మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. రథం కాలిపోయి భక్తులు విచారంలో ఉంటే ఓ చెక్క కాలిపోయిందని చేసిన వ్యాఖ్యలు
భక్తుల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతలను కట్టడి చేయకుండా మౌనం వహిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాల్లో రాజకీయ నేతలు తలదూర్చడం సబబు కాదని సంజయ్ హితవు పలికారు. మత విశ్వాలు, ఆచార, సంప్రదాయాల విషయంలో రాజకీయ నేతలు జోక్యం చేసుకుంటే వారి భవితవ్యాన్ని ప్రజలే నిర్ణయిస్తారని హెచ్చరించారు. అన్ని వర్గాలను సమదృష్టితో చూడాల్సిన పాలకులు ఓ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు.

Related posts