భూముల కొనుగోలువ్యవహారంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. సెంటుపట్టా పేరుతో మీ పార్టీ నాయకులు కోట్ల రూపాయలు కూడపెడుతున్నారన్నారు. రూ.12 లక్షల భూమికి రూ.55 లక్షలు.. కుదరదంటే ఏ స్థాయి అధికారికైనా బెదిరింపులు, బదిలీలుంటాయని చెప్పారు. రైతుల వద్ద నుండీ కమీషన్ల వసూళ్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. భూముల కొనుగోలు, మెరకల్లో వందల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఆరోపించారు. అవినీతిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు?’ అని దేవినేని ప్రశ్నించారు.
నెల్లూరు కలెక్టర్ బదిలీ వెనుక కొత్త కోణం బయటపడిందంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను పోస్ట్ చేశారు. కలెక్టర్ శేషగిరి బాబు బదిలీ వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారని, మొదట సెలవుపై వెళ్లిన శేషగిరి బాబు, ఐదు రోజులకే అర్ధరాత్రి బదిలీ అయినట్లు తెలిసిందని ఆ పత్రికలో పేర్కొన్నారు. ఇందుకు కావలి భూ తతంగమే కారణమై ఉంటుందని ఆయన తెలిపారు.
ఆనాడు కేసీఆర్ మేల్కొని ఉంటే ఎంతో బాగుండేది: విజయశాంతి