telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నిరాశాజనకంగా.. బోటువెలికితీత ..

boat bringing attempt failed

వరద తాకిడి తగ్గిందని బోటువెలికితీత ప్రయత్నించగా, అది నిరాశనే మిగిల్చింది. ఈ రోజు బోటును బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కాని ఫలితం కనిపించలేదు. అయితే సోమవారం నదిలోకి వదిలిన 2 వేల మీటర్ల ఐరన్ రోప్ తెగిపోవడంతో వెయ్యి మీటర్ల రోప్ నీట మునిగిపోయింది. నేడు వేసిన లంగర్ బయటకు లాగే క్రమంలో ఐరన్ కొక్కెం ఊడిపోయింది. దీంతో మరోసారి లంగర్ వేశారు.

లంగర్ ఐరన్ కొక్కెం పెద్దగా ఉండటంతో లంగర్‌కు బోటు తగిలిందని, బోటు కదిలిందని స్థానికులు చెబుతున్నారు. రేపు బోటు వెలికితీయడం ఖాయం అని ధర్మాడి సత్యం టీం చెబుతోంది. ఇదిలా ఉంటే, కచ్చులూరు వద్దకు మీడియా ప్రతినిధులను అనుమతించడం లేదు. మీడియా పై బ్యాన్ ఎందుకు విధించారో.. అసలు దీని వెనుక కారణం ఏమై ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజానీకాన్ని మాత్రం అనుమతించడం పై సందేహాలు.

Related posts