telugu navyamedia
సినిమా వార్తలు

“తికమక మకతిక” పడుతున్న అర్జున్ సురవరం

Arjun-Suravaram

బి. మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్‌, ఆరా సినిమా ప్రై.లి. ప‌తాకాల‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం “అర్జున్ సురవరం”. ఈ మ‌ధ్యే విడుద‌లైన టైటిల్ పోస్ట‌ర్ కు, టీజర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. “రాతిరి కునుకు అతుకు అతుకు… అలుపు సొలుపుల నడుమల బతుకు… ” అంటూ తెలంగాణ యాసలో సాగుతోంది ఈ పాట. సామ్ సీఎస్ సంగీతం, వరికుప్పల యాదగిరి సాహిత్యం బాగున్నాయి.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది అర్జున్ సురవరం. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. ఇందులో జర్నలిస్ట్ గా నటిస్తున్నారు నిఖిల్. రాజ్ కుమార్ – వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాన నిర్మిస్తున్నారు. ఇక శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేయగా… రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఈ చిత్రంతో నిఖిల్ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు.

Related posts