త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన “అల వైకుంఠపురంలో” చిత్రంలోని సాంగ్స్ ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా “బుట్టబొమ్మ” సాంగ్. తాజాగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ తనయుడు రవీ కపూర్ బుట్టబొమ్మ సాంగ్‌ని ఎంజాయ్ చేస్తూ స్టెప్పులు వేశాడు. ఈ వీడియోని ఏక్తా తన ఇన్‌స్టాగ్రాములో షేర్ చేస్తూ.. “నా కొడుకుకి నచ్చిన పాట. సంగీతానికి భాష, భేదం అనే తేడా లేదని ఈ సాంగ్ నిరూపించింది” అని ఏక్తా తెలిపింది. “బుట్టబొమ్మ” సాంగ్‌ని బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ ఆలపించగా, థమన్ సంగీతం అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా ఈ పాటకి ఇంత పాపులారిటీ రావడంలో భాగం అయింది. ఈ మధ్యకాలంలో భాషకి సంబంధం లేకుండా సంగీత ప్రేమికులని ఎంతగానో అలరించిన పాట “బుట్ట బొమ్మ”.. ఈ సాంగ్‌కి చిన్న పిల్లాడి నుండి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. డేవిడ్ వార్నర్, దిశా పఠానీ, శిల్పా శెట్టి ఇలా చాలా మంది ప్రముఖులు ఈ సాంగ్‌కి టిక్ టాక్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఫుల్ వైరల్ అయ్యాయి.
previous post