telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రష్యా అమ్మాయి -కరీంనగర్ అబ్బాయి.. ఘనంగా ప్రేమ వివాహం

karimnagar marriage

కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడు రష్యాకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. కరీంనగర్ పట్టణ శివారులో ఆధివారం జరిగిన ఈ వివాహం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. పట్టణానికి చెందిన సందీప్ కుమార్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ తన కాలేజీలోనే చదువుకుంటున్న రష్యాకు చెందిన వెరోనికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఇద్దరు ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపారు. వారు కూడా అంగీకరించడంతో ఆదివారం వీరి వివాహం ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి వధువు తరపున వెరోనిక తల్లి హాజరైంది. ఘనంగా జరిగిన ఈ వివాహానికి పలువురు పెద్దలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Related posts