telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

విశాఖలో ఆగని ఉల్లి లొల్లి.. రైతుబజార్ వద్ద తొక్కిసలాట!

onions

ఉల్లి ధర చుక్కలనంతడంతో ఏపీ సర్కారు రైతుబజార్ల ద్వారా రూ.25లకే ఉల్లి అమ్మకాలు చేస్తున్న విషయం తెలిసిందే. పక్షం రోజులపాటు విశాఖ మహానగరంలో కొనసాగిన ఉల్లిలొల్లికి నిన్న ఒక్కరోజే విశ్రాంతి. ఆదివారం సబ్సిడీ ఉల్లి అమ్మకాలు లేకపోవడంతో రైతు బజార్లు ప్రశాంతంగా కనిపించాయి. సోమవారం నుంచి మళ్లీ సేమ్ సీన్ ప్రారంభమయ్యింది. రైతుబజార్ల వద్ద ఉల్లి లొల్లి మళ్లీ మొదలయ్యింది. దీంతో నగరంలోని 13 రైతుబజార్ల వద్ద ప్రజలు బారులు తీరారు. సబ్సిడీ ఉల్లి అమ్మకాలకోసం తొక్కిసలాటలు మొదలయ్యాయి.

తెల్లవారు జామున నాలుగు గంటలకే క్యూలో నిల్చోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. సబ్సిడీ ఉల్లికోసం భారీగా తరలివచ్చిన వారిని రైతు బజారు సిబ్బంది అదుపుచేయలేక పోలీసుల సహకారం కోరాల్సి వచ్చింది. దీంతో ఐదు రోజుల నుంచి పోలీసుల పహరా మధ్యే ఉల్లి అమ్మకాలు జరిపారు. కొన్ని కుటుంబాల నుంచి ఇద్దరు ముగ్గురు వచ్చి క్యూలో రెండు మూడుసార్లు నిల్చుని ఉల్లి దక్కించుకుని తర్వాత బహిరంగ మార్కెట్లోను, హెూటళ్లకు అధిక ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వెల్లువిరుస్తున్నాయి.

Related posts