సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ లో మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కత్తెర (సిజర్) గుర్తును కేటాయించినట్లు పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందన్నారు.కుల సంఘాలు, ప్రజాసంఘాల్లో పని చేసిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తామన్నారు. సామాజిక న్యాయం అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళతామని తెలిపారు. అవినీతి నిర్మూలన జరగాలంటే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉందన్నారు.
డిసెంబర్ కి ముందే భారత్ లోకి ఆ వైరస్…?