తెలంగాణ బీజేపీ నాయకులు తమ వైఖరితో భారతీయ జనతా పార్టీని భారతీయ ఝూటా పార్టీగా మార్చేసారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. పూటకో పుకారు పుట్టిస్తారు గంటకో అబద్ధం ఆడేస్తారు ఇదీ బిజీపి నాయకుల నైజమన్నారు. వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని సామెత. కానీ బి జె పి మాత్రం దుబ్బాకలో వెయ్యి అబద్దాలాడైనా ఒక ఎన్నిక గెలవాలె అనే కొత్త సామెతను సృష్టిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఉపఎన్నిక ప్రచారం ప్రారంభం అయినప్పటి నుంచి ఒక్క బిజెపి నాయకుడు నిజం మాట్లాడటం లేదు. అబద్ధాలే పునాదిగా బి జె పి తప్పుడు ప్రచారాలకు తెరతీసిందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకొని గ్రామస్థాయి వార్డు నాయకునిదాకా అందరూ అబద్ధాలు ఆడేవారేనని.. అసత్యమే వారి ఆయుధం.. వ్యక్తిగత దూషణలు వారి నైజమన్నారు. భారతీయ సాంప్రదాయానికి తామే ప్రతినిధులుగా చెప్పుకునే బిజెపినాయకులు “సత్యమేవ జయతే” అనే ఉపనిషత్ సూక్తిని విస్మరించారు. “అసత్యమేవ జయతే” అనే వారు నమ్ముతున్నారని పేర్కొన్నారు.
previous post
next post
భూదందా కోసమే రాజధాని మార్పు: కన్నా