telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

50 వేల ఎంబీబీఎస్ వైద్యులు విధులలోకి…

Kcr telangana cm

వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఈరోజు సమావేశమయ్యారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించారు. ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పని ఒత్తిడి తగ్గించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ మేరకు 50 వేల మంది ఎంబీబీఎస్ వైద్యులను విధులలోకి తీసుకోవాలన్నారు. 2-3 నెలల కాలానికి వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, పారామెడికల్ సిబ్బందిని వెంటనే నియమించుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. తాత్కాలికంగా పనిచేసే సిబ్బందికి గౌరవప్రదమైన జీతం ఇవ్వనున్నట్లు తెలిపారు. కరోనా లాంటి కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్న వారికి సరైన గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. కష్ట కాలంలో ప్రజలకు సేవ చేసేందుకు యువ వైద్యులు ముందుకు రావాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

Related posts