telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీ సీఎం జగన్- భారతి దంపతుల 25 వ వివాహ వార్షికోత్సవం

ఈరోజు ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ – వైఎస్‌ భారతి దంపతులు 25 వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. 1996 ఆగస్టు 28న వీరి వివాహం ఘనంగా జరిగింది. జగన్ వివాహ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. వివాహ సయమంలో వైఎస్ జగన్ వయసు కేవలం 24 సంవత్సరాలు. వైఎస్ జగన్-భారతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హర్షారెడ్డి, చిన్న కుమార్తె వర్షా రెడ్డి. హర్షారెడ్డి.

ప్రస్తుతం భారతి సిమెంట్స్,సాక్షి మీడియా గ్రూప్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న తెలిసిందే. 25 వ వివాహ వార్షికోత్సవం నేపథ్యం లో జగన్‌ ఫ్యామిలీ తో కలిసి సిమ్లా టూర్‌కి వెళ్లారు. ఐదు రోజుల పాటు అక్కడే గడపనున్నారు.

ఈ నేపథ్యం లో వైసీపీ పార్టీ లో కోలాహలం నెలకొంది. మంత్రులు మరియు ఎమ్మెల్యే లతో పాటు పలువురు నాయకులు జగన్‌ దంపుతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు ఏపీలో ఓ భారీ కటౌట్‌ సందడి చేస్తోంది. శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధు సూదన్‌ రెడ్డి ఈ భారీ కటౌట్‌ ను ఏర్పాటు చేశారు. జగన్‌- భారతిల ఫొటోలతో దీన్ని రూపొందించారు శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. సీఎం జగన్‌ దంపతలకు విషెస్‌ చెబుతూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ భారీ కటౌట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Related posts