telugu navyamedia
సినిమా వార్తలు

పుష్ప” అప్డేట్ అదిరిపోయింది…

‘పుష్ప’ సినిమా నుంచి విలన్​ ఫస్ట్​లుక్ వచ్చేసింది..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మూవీ “పుష్ప : ది రైజ్-పార్ట్ 1”. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ప్రేక్షకులల్లో ఆసక్తిని పెంచేస్తోంది.

తాజాగా ఈ సినిమా నుంచి “పుష్ప” విలన్ ఫహద్ ఫాసిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఆయనకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తూ పాత్రను కూడా రివీల్ చేశారు.  దక్షిణాదిలో అన్ని భాషల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్​.. ‘పుష్ప’ చిత్రంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన బన్వర్​ సింగ్ షెకావత్​ అనే పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.

pushpa fahadh faasil first look

తలపై గాటు, గుండు లుక్​తో ఉన్న ఆయన ఫొటో ఫ్యాన్స్​ను ఉర్రూతలూగించడమే కాకుండా సినిమాపై ఫహద్ ఫాసిల్ కు సంబంధించిన ఈ లుక్ అదిరిపోయింది. . దీంతో సినిమాపై భారీ అంచనాల్ని పెంచుతోంది.

First Look: Pushpa Villain Fahadh Is Ferocious -

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం ఈ ఏడాది డిసెంబరు 25న థియేటర్లలోకి రానుంది. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక చేస్తోంది. కన్నడ నటుడు ధనుంజయ, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. సుకుమార్ డైరెక్టర్. మైత్రీమూవీమేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది.

Related posts